Friday 10th April 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఒక్క ఓటు కోసం ‘యుద్ధం’..పోలింగ్ కేంద్రం వద్ద యువతి పోరాటం!

ఒక్క ఓటు కోసం ‘యుద్ధం’..పోలింగ్ కేంద్రం వద్ద యువతి పోరాటం!

keralam assembly elections

 

Voter Akshaya struggle Keralam elections | కేరళం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గురువారం త్రిస్సూర్ జిల్లాలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

తన వేలికి 15 కుట్లు పడినా, ఇన్ఫెక్షన్ ముప్పు పొంచి ఉన్నా.. వెనక్కి తగ్గకుండా పోరాడి తన ఓటు హక్కును కాపాడుకున్నారు కేరళకు చెందిన అక్షయ అనే యువతి.

గురువారం కేరళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసే చివరి నిమిషంలో ఆమె సాధించిన విజయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

అసలేం జరిగింది..
|త్రిస్సూర్ జిల్లా కూర్కెంచేరిలోని స్వామి బోధానంద స్కూల్ పోలింగ్ బూత్‌కు అక్షయ తన 18 నెలల బిడ్డతో కలిసి మధ్యాహ్నం 1:30 గంటలకు చేరుకున్నారు.

ఏప్రిల్ 6న జరిగిన ప్రమాదంలో ఆమె ఎడమ చేతి చూపుడు వేలుకు తీవ్ర గాయమై 15 కుట్లు పడ్డాయి. దీనివల్ల ఆ వేలికి భారీ బ్యాండేజ్ ఉంది.

నిబంధనల ప్రకారం ఎడమ చేతి చూపుడు వేలుపై ఇంక్ వేయాలని, బ్యాండేజ్ తీస్తేనే ఓటుకు అనుమతిస్తానని ప్రిసైడింగ్ అధికారి భీష్మించుక కూర్చున్నారు.

మెడికల్ రిపోర్టులు చూపించినా, బ్యాండేజ్ తీస్తే ఇన్ఫెక్షన్ అవుతుందని మొరపెట్టుకున్నా అధికారి వినలేదు.

ఓటు వేయనివ్వకుండా అడ్డుకోవడాన్ని రాజ్యాంగ ఉల్లంఘనగా పరిగణించిన స్థానికులు మరియు రాజకీయ నాయకులు అక్షయకు మద్దతుగా నిలిచారు. ఈ విషయం చివరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEO) దృష్టికి వెళ్ళింది.

మానవీయ కోణంలో ఆలోచించిన సీఈఓ.. మెడికల్ రిపోర్టుల ఆధారంగా వేరే వేలికి లేదా బ్యాండేజ్‌పైనే ఇంక్ వేసి ఓటు వేయించమని ఆదేశించారు.

ఈఓ ఆదేశాలతో సాయంత్రం 6:15 గంటలకు, అంటే పోలింగ్ ముగియడానికి కేవలం కొన్ని నిమిషాల ముందు అక్షయ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికారి ఆ బ్యాండేజ్‌పైనే నీలం ఇంక్ వేశారు.

ఓటు వేసి బయటకు వచ్చిన అక్షయ, ఇంక్ వేసిన ఆ బ్యాండేజ్ వేలిని మీడియాకు చూపిస్తూ చిరునవ్వుతో తన సంతోషాన్ని పంచుకున్నారు.

“ఓటు వేయాలనే నా పట్టుదల గెలిచింది” అని అక్షయ పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఓటు వేయడం పౌరుల బాధ్యత అని ఆమె ఈ ఉదంతం ద్వారా చాటిచెప్పారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions