KCR announces Maganti Sunitha as BRS candidate for Jubilee Hills by-poll | జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా సేవలందించిన బీఆరెస్ నాయకులు మాగంటి గోపీనాథ్ మృతితో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. అతి త్వరలోనే బై ఎలక్షన్స్ జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో బీఆరెస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆరెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. పార్టీలో సీనియర్ నేతగా, జూబ్లీహిల్స్ ప్రజల అభిమాన నాయకుడిగా స్థానం సంపాదించుకున్న దివంగత మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతకే ప్రాధాన్యతనిస్తూ ఆమెను అభ్యర్ధిగా కేసీఆర్ ఎంపిక చేసినట్లు గులాబీ పార్టీ స్పష్టం చేసింది.
చిత్తశుద్ధి కలిగిన నిస్వార్థ నేతగా, వారి నిబద్ధతను పరిశీలించిన మీదట, మాగంటి గోపీనాథ్ పార్టీకి, ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపు, గౌరవాన్నిస్తూ జూబ్లీహిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకు దివంగత గోపీనాథ్ కుటుంబానికే అవకాశం ఇవ్వాలని కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఆరెస్ వెల్లడించింది.









