- ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రకటించిన వందేభారత్ ఫౌండషన్
- అవార్డు అందజేసిన నిమ్స్ హైదరాబాద్ డైరెక్టర్ మార్తా రమేశ్
Sanjeeva Ratna Puraskar | కేబీకే హాస్పిటల్ వ్యవస్థాపకులు కక్కిరేణి భరత్ కుమార్ (Kakkireni Bharat Kumar) కు మరో అరుదైన గౌరవం దక్కింది.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వందేభారత్ ఫౌండేషన్ (Vande Bharat Foundation), తెలంగాణ ప్రభుత్వం తరఫున హైదరాబాద్ నిమ్స్ డైరెక్టర్ మార్తా రమేశ్.. డాక్టర్ భరత్ కుమార్ కు సంజీవ రత్న పురస్కార్ అవార్డు అందజేశారు.
ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల ఆంప్యుటేషన్స్ కి కారణమవుతూ ఎంతోమందిని అర్ధాంతరంగా వికలాంగులుగా మారుస్తున్న గ్యాంగ్రిన్ పై (Gangrene) అవగాహన కల్పించడంతోపాటు అత్యాధునిక చికిత్స అందిస్తున్నందుకుగానూ భరత్ కుమార్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు మార్తా రమేశ్ బుధవారం భరత్ కుమార్ కు అవార్డు అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గ్యాంగ్రిన్, డయాబెటిక ఫుట్ అల్సర్ లాంటి ఎన్నో వ్యాధుల వల్ల ఏటా కొన్ని లక్షల మంది తమ కాళ్లు చేతులు పోగొట్టుకుంటున్నారని తెలిపారు.
ఈ ఆంప్యుటేషన్స్ కి చెక్ పెడుతూ కేబీకే హాస్పిటల్ అత్యాధునిక చికిత్స అందించడం శుభపరిణామం అని పేర్కొన్నారు.
గ్యాంగ్రిన్ పై అవగాహన పెంచేందుకు కేబీకే హాస్పిటల్ ఉచిత హెల్త్ క్యాంప్ లు నిర్వహించడం అభినందనీయం అని కొనియాడారు. కేబీకే హాస్పిటల్ సేవలు మరింత విస్తరించి బాధితులు అవయవాలు కాపాడాలని ఆకాంక్షించారు.
అనంతరం కేబీకే గ్రూప్ చైర్మన్ భరత్ కుమార్ మాట్లాడుతూ వందేభారత్ ఫౌండేషన్ తరఫున సంజీవ రత్న పురస్కార్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
గ్యాంగ్రిన్, ఫుట్ అల్సర్స్, సెల్యూలైటిస్ లాంటి వ్యాధుల నుంచి బాధితుల అవయవాలు కాపాడాలనే సంకల్పంతో సేవా దక్పథంలో లాభాపేక్ష లేకుండా ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
కేబీకే హాస్పిటల్ ద్వారా ఇప్పటికే కొన్ని వందల మందికి చికిత్స అందించి కాళ్లు, చేతులు తొలగించాల్సిన అవసరం లేకుండా నయం చేశామన్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న హాస్పిటల్ సేవలను అతి త్వరలో రెండు రాష్ట్రాలకు విస్తరిస్తామని భరత్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జేసీఐ సూపర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ నిఖిల్ గుండా, కేబీకే గ్రూప్ ప్రతినిధులు విశాఖ రాజేందర్ రెడ్డి, సావిరెడ్డి సందీప్ రెడ్డి, జక్కి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.









