Karthik Aaryan-Sree Leela Dating Rumors | బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్, హీరోయిన్ శ్రీలీల డేటింగ్ లో ఉన్నట్లు గత కొన్నిరోజులుగా ర్యూమర్స్ వినిపిస్తున్నాయి.
తెలుగు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నారు. అనురాగ్ బసు దర్శకత్వంలో ఆమె ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో కార్తిక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నారు.
ఈ క్రమంలోనే షూటింగ్ సందర్భంగా కార్తిక్ ఆర్యన్-శ్రీలీల మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారినట్లు కథనాలు వస్తున్నాయి. అలాగే ఇటీవల కార్తిక్ ఆర్యన్ ఇంట్లో జరిగిన పార్టీకి శ్రీలీల హాజరవడంతో జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చింది.
ఇదే సమయంలో కార్తిక్ ఆర్యన్ తల్లి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఐఫా వేడుకల్లో పాల్గొన్న హీరో తల్లిని, ఇంటికి ఎలాంటి కోడలు రావాలను అనుకుంటున్నారూ అంటూ నిర్మాత కరణ్ జోహార్ ప్రశ్నించారు. ప్రశ్నకు స్పందిస్తూ ఇంటికి ఓ మంచి డాక్టర్ కోడలిగా రావాలని కోరుకుంటున్నట్లు కార్తిక్ ఆర్యన్ తల్లి సమాధానమిచ్చారు.
ఇదిలా ఉండగా నటిగా కొనసాగుతూనే శ్రీలీల ఎంబీబీఎస్ చేస్తున్న విషయం తెల్సిందే.