Gopichand To Play Antagonist In Prabhas’ Spirit? | పాన్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘స్పిరిట్’. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది రిలీజ్ కానున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదే సమయంలో స్పిరిట్ లో మరో స్టార్ యాక్టర్ భాగం కాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయనే నటుడు గోపీచంద్. ప్రభాస్ మరియు గోపిచంద్ మధ్య దశాబ్దాలకు పైగా మంచి స్నేహం ఉంది.
2004లో విడుదలైన వర్షం సినిమాలో ఈ ఇద్దరు కలిసి నటించారు. ఇందులో విలన్ పాత్రలో గోపిచంద్ కనిపించి ప్రశంసలు పొందారు. మళ్లీ రెండు దశాబ్దాల తర్వాత ప్రభాస్-గోపిచంద్ స్పిరిట్ లో కలిసి నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇకపోతే వచ్చే ఏడాది మార్చి 5న స్పిరిట్ విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.









