Golden Hour In Cyber Crimes | ఇంటర్నెట్ ( Internet ) వినియోగం అధికం అయిన ఈ రోజుల్లో సైబర్ కేటుగాళ్ళు రెచ్చిపోతున్నారు.
ఓటిపి ( OTP ), వాట్సప్ గ్రూపు ( Whatsapp )ల్లో లింకులు ఇలా అనేక మార్గాల్లో సైబర్ నేరగాళ్లు రూ. కోట్లల్లో డబ్బులు కొట్టేస్తున్నారు. ఈ క్రమంలో సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇందులో భాగంగా ఒకవేళ సైబర్ ( Cyber ) నేరానికి గురైతే నేరం జరిగిన మొదటి గంటలోనే ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యమని తెలంగాణ పోలీసులు పేర్కొన్నారు. తద్వారా స్కామర్ అకౌంట్ ను ఫ్రీజ్ చేసే అవకాశముంటుంది, పోయిన డబ్బు రికవరీ సులభతరమవుతుంది.
సైబర్ మోసానికి గురైన మొదటి గంటను గోల్డెన్ అవర్ ( Golden Hour ) అంటారు. మోసం జరిగిన మొదటి గంటలోనే ఫిర్యాదు చేస్తే డబ్బు రికవరీ అవకాశం పెరుగుతుంది.
ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలంగాణ పోలీస్ విభాగం ఒక ప్రకటన చేసింది.