Sunday 11th January 2026
12:07:03 PM
Home > తాజా > ‘తెలుగు భాషలో ఛార్జ్ షీట్..పోలీసు శాఖలో సరికొత్త అధ్యాయం’

‘తెలుగు భాషలో ఛార్జ్ షీట్..పోలీసు శాఖలో సరికొత్త అధ్యాయం’

First Chargesheet In Telugu | సాధారణంగా పోలీస్ దర్యాప్తు, కోర్టు పత్రాలు అంటే అంతా ఇంగ్లీష్‌మయం.. కానీ ఆ విధానానికి స్వస్తి పలికి, సామాన్యులకు అర్థమయ్యేలా మన మాతృభాష తెలుగులో అభియోగపత్రం (Charge Sheet) దాఖలు చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు దుండిగల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ స్వరూప. ​మాతృభాషపై మక్కువతో ఇంగ్లీష్ రాని సామాన్యులకు కూడా కేసు వివరాలు అర్థం కావాలనే ఉద్దేశంతో 2025లో రెండు కేసుల దర్యాప్తు నివేదికలను పూర్తిగా తెలుగులోనే కోర్టుకు సమర్పించారు.

ఒక మిస్సింగ్ కేసును వేగంగా ఛేదించి, తల్లి బిడ్డలను క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించి తన కర్తవ్యాన్ని చాటుకున్నారు. ఏసీపీ శంకర్ రెడ్డి సహకారంతో, మేడ్చల్ కోర్టులో ఈ తెలుగు అభియోగపత్రాలను దాఖలు చేయడం విశేషం. ​తెలంగాణ రాష్ట్ర అధికార భాషలో దర్యాప్తు పూర్తి చేసినందుకు గాను, ఇటీవల బంజారాహిల్స్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా ఆమె ప్రశంసలు అందుకున్నారు.

You may also like
అల్లు అర్జున్ పాట పాడి అదరగొట్టిన కేంద్రమంత్రి
చెప్పులు లేకుండా రోడ్డుపై రౌడీలు..గుంటూరు పోలీసుల తీరే వేరు!
‘హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారు’..ఒవైసీ vs బండి
సైబర్ వలలో జేడీ లక్ష్మీనారాయణ సతీమణి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions