Monday 16th September 2024
12:07:03 PM
Home > తాజా > కరీంనగర్ లో భారీ అగ్ని ప్రమాదం.. 10 సిలిండర్లు బ్లాస్ట్!

కరీంనగర్ లో భారీ అగ్ని ప్రమాదం.. 10 సిలిండర్లు బ్లాస్ట్!

Karimnagar fire accident

Karimnagar Fire Accident | తెలంగాణలోని కరీంనగర్‌ (Karimnagar)లో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని ఆదర్శ నగర్‌లో 10 సిలిండర్ పేలిపోయాయి. దీంతో 15 గుడిసెలు కాలి బూడిదయ్యాయి.

ఓ ఇంట్లో దేవుడికి పెట్టిన దీపం ఈ అగ్ని ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఆదర్శ నగర్ ప్రాంతాంలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగించే కొందరు గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు. వారందరూ మంగళవారం మేడారం జాతరకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

ఈ క్రమంలో ముందు ఇంట్లో దేవుడికి దీపం పెట్టి తాళాలు వేసుకొని బయల్దేరారు. ఆ దీపం గుడిసెలకు అంటుకుని వేగంగా మంటలు వ్యాపించినట్లు సమచారం. దీంతో గుడిసెల్లో ఉన్న 10 సిలిండర్లు పేలిపోయాయి.

ఈ ప్రమాదంలో క్షణాల్లోనే 15 గుడిసెలు దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారం అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. గుడిసెల్లోని వారంతా మేడారం జాతరకు వెళ్లడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions