Friday 30th January 2026
12:07:03 PM
Home > తాజా > కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే!

కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే!

cm kcr

KCR To Take Oath | మాజీ సీఎం, గజ్వెల్ ఎమ్మెల్యే కేసీఆర్ (KCR) త్వరలోనే ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు.

ఫిబ్రవరి 1న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్ లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు గులాబీ బాస్.

కాగా నవంబరు లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వెల్ (Gajwel) మరియు కామారెడ్డి స్థానాల్లో పోటీ చేశారు కేసీఆర్.

అయితే కామారెడ్డిలో ఓడిపోయినా, గజ్వెల్ లో మాత్రం 45 వేల మెజారిటీ తో ఎమ్మెల్యేగా హాట్ట్రిక్ విజయాన్ని నమోదు చేశారు.

ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ నూతనంగా గెలిచిన ఎమ్మెల్యే లచే ప్రమాణం చేయించారు.

ఇదే సమయంలో తన ఫార్మ్ హౌస్ లో కాలు జారీ పడడంతో కేసీఆర్ తుంటి ఎముకకు సర్జరీ అయిన విషయం తెల్సిందే.

అనంతరం యశోదా ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు, ఇటీవల ఆయన కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న స్పీకర్ సమక్షంలో ఎమ్మెల్యే గా ప్రమాణం చేయనున్నారు.

You may also like
kalvakuntla kavitha
‘కేసీఆర్ సమాచారాన్ని రేవంత్ కు చేరవేసే గూఢచారి ఆయనే’
మంచిగా చదువుకో బిడ్డా..కేసీఆర్ గొప్పమనసు
tpcc chief mahesh goud
కేసీఆర్ కుటుంబంలో తగాదాలకు మూలం అదే: టీపీసీసీ చీఫ్ మహేశ్
bandi sanjay kumar
అభివృద్ధి మా విధానం… హిందుత్వం మా నినాదం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions