Corona New Variant | ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి కలవరపెడుతోంది. కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 విస్తరిస్తోంది. ఈ వేరియంట్ ను సెప్టెంబర్ లో అమెరికాలో గుర్తించారు. ఇటీవల చైనాలో కూడా 15 కేసులు వెలుగులోకి వచ్చాయి.
తాజాగా కొద్దిరోజుల కిందట ఈ జేఎన్ వేరియంట్ భారత్ లోకి కూడా ప్రవేశించింది. కేరళలోని 78 ఏళ్ల మహిళలో ఆ వైరస్ లక్షణాలను వైద్యులు గుర్తించారు. అయితే ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాపిస్తుందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం మన దేశంలో సోమవారం నాటికి 1,828కి యాక్టివ్ కేసులు ఉన్నాయి. సోమవారం ఒక్కరోజే దేశంలో 335 కరోనా కేసులు బయటపడ్డాయి. 5 మరణాలు సంభవించాయి. అందులో నాలుగు కేరళలోనే నమోదయ్యాయి.
ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వృద్ధులు తప్పకుండా మాస్క్ ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. 60 ఏళ్లకు పైబడిన వారు, ఇతర వ్యాధులతో బాధపడే వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ఆరోగ్య ఏర్పాట్లు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది. కరోనా పరీక్షలకు ఆర్టీపీసీఆర్ కిట్లను సిద్ధంగా ఉంచుకోవాలని.. టెస్టుల సంఖ్య పెంచాలని సూచించింది.
జిల్లాల్లో కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని.. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలను INSACOG ల్యాబ్‌లకు పంపాలని తెలిపింది.
లక్షాణాలు ఇవే..
JN.1 వేరియంట్ యొక్క లక్షణాలు జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి మరియు తలనొప్పి. చాలా మంది రోగులు తేలికపాటి ఎగువ శ్వాసకోశ లక్షణాలను గుర్తించవచ్చు. ఈ లక్షణాలు సాధారణంగా నాలుగు నుండి ఐదు రోజులలో బయటపడే అవకాశాలు ఉన్నాయి.