Sunday 8th September 2024
12:07:03 PM
Home > Uncategorized > ప్రధాని మోదీతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి భేటి!

ప్రధాని మోదీతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి భేటి!

cm meets pm

CM Revanth Meets PM Modi | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం తొలి సారి ప్రధాని మోదీ తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మంగళవారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు పీఎం తో సమావేశమయ్యారు. సుమారు అరగంట సేపు సాగిన ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలు, పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చాలని కోరారు.

రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం రెండు రాష్ట్రాల్లోనూ ఒక్కో ప్రాజెక్టుకు జాతీయ హోదా క‌ల్పిస్తామ‌ని తెలిపార‌ని, అందుకు అనుగుణంగా పోలవరం ప్రాజెక్ట్ తరహాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అలాగే హైదరాబాద్ లో ఐటీఐఆర్ ను పునరుద్ధరించాలని ప్రధానిని సీఎం కోరారు.

హైదరాబాద్ లో ఐఐఎం ను మరియు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో సైనిక్ స్కూల్ ను ఏర్పాటు చేయాలని విన్నవించారు. వీటితో పాటు వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన రూ.1,800 కోట్లు మరియు ఇతర పెండింగ్ గ్రాంట్లు రూ.2,700 కోట్లు విడుదల చేయాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

ప్ర‌ధాన‌మంత్రి దృష్టికి తీసుకెళ్లిన అంశాలు:

రాష్ట్రంలో 14 ర‌హ‌దారుల‌ను జాతీయ ర‌హ‌దారులుగా అప్‌గ్రేడ్ చేయాల‌ని ప్ర‌తిపాద‌న‌లు పంపించాం. అందులో కేవ‌లం రెండింటికే ఆమోదం తెలిపారు. మిగ‌తా 12 ర‌హ‌దారుల అప్‌గ్రేడ్‌న‌కు ఆమోదం తెల‌పాలి.

• ములుగులోని గిరిజ‌న విశ్వ‌విద్యాల‌యం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2023-24 విద్యా సంవ‌త్స‌రంలో ప్ర‌వేశాల‌కు అనుమ‌తి ఇవ్వాలి.

• ఆంధ్ర‌ ప్ర‌ దేశ్ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌ కారం పూర్వ ఖ‌మ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారం (బ‌య్యారం స్టీల్ ప్లాంట్‌) ఏర్పాటుకు కేంద్రం హామీ ఇచ్చినందున దానిని వెంట‌నే నెర‌వేర్చాలి. అలాగే కాజీపేటలో కోచ్ ఫ్యాక్ట‌ రీ ఏర్పాటు చేయాల్సి ఉండ‌గా పీరియాడిక‌ల్ ఓవ‌ర్‌హాలింగ్ వ‌ర్క్‌షాప్ ఏర్పాటు చేస్తామ‌ని రైల్వే శాఖ ప్ర‌ క‌టించింది. దానికి అద‌నంగా కోచ్ ఫ్యాక్ట‌ రీ ఏర్పాటు చేయాలి.

• 2010లో నాటి కేంద్ర ప్ర‌ భుత్వం బెంగ‌ళూర్‌, హైద‌రాబాద్‌ల‌కు ఐటీఐఆర్‌ను ప్ర‌క‌టించింది. కానీ 2014లో కేంద్రంలో ప్ర‌ భుత్వం మారిన త‌ర్వాత హైద‌రాబాద్ ఐటీఐఆర్‌ను ప‌క్క‌ న‌పెట్టారు, హైద‌రాబాద్ ఐటీఐఆర్‌ను వెంట‌నే పున‌రుద్ధ‌ రించాలి.

• పీఎం మిత్ర కింద గుర్తించిన ఏడు మెగా జౌళి పార్కుల్లో వ‌రంగ‌ల్‌లోని కాక‌తీయ మెగా జౌళి పార్కును బ్రౌన్ ఫీల్డ్ పార్కుగా ప్ర‌క‌టించడంతో దానికి రావ‌ల్సిన‌న్ని నిధులు రానందున వెంట‌నే దానిని గ్రీన్‌ఫీల్డ్‌లోకి మార్చాలి.

• ప్ర‌తి రాష్ట్రానికి ఐఐఎం మంజూరు చేయాల‌నే ప్ర‌ తిపాద‌న ఉంది, తెలంగాణ‌లో ఐఐఎం లేనందున హైద‌రాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలి, అందుకు త‌గిన స్థ‌ లం అందుబాటులో ఉంది. కేంద్రం కోరితే ఐఐఎం ఏర్పాటుకు అవ‌సర‌మైన స్థ‌లం ఇవ్వ‌ డానికి రాష్ట్ర ప్ర‌ భుత్వం సిద్ధంగా ఉంది.

• ఉమ్మ‌ డి రాష్ట్రంలో ఉన్న రెండు సైనిక పాఠ‌శాల‌లు రాష్ట్ర విభ‌జ‌న‌తో ఆంధ్ర‌ ప్ర‌ దేశ్‌కు వెళ్లిపోయాయి. ప్ర‌ స్తుతం తెలంగాణ‌లో సైనిక స్కూల్ లేనందున సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో సైనిక పాఠ‌శాల ఏర్పాటు చేయాలి.

• భార‌తీయ సైన్యానికి సంబంధించిన ప్ర‌ ధాన కార్యాల‌యాలు అన్ని ప్రాంతాల్లో ఉన్నా ద‌క్షిణాదిలో లేనందున పుణెలో ఉన్న ప్ర‌ ధాన కార్యాల‌యాన్ని సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు త‌ర‌లించాలి.

• రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం తొమ్మిదో షెడ్యూల్‌లోని ప్ర‌ భుత్వ సంస్థ‌ ల విభ‌జ‌న‌, ప‌దో షెడ్యూల్‌లోని సంస్థ‌ ల అంశాల‌ను ప‌రిష్క‌ రించాలి. ఢిల్లీలోని ఉమ్మ‌ డి భ‌వ‌న్ విభ‌జ‌న‌కు స‌హ‌క‌రించాలి.

You may also like
Modi Revanth Reddy
సీఎం రేవంత్ రెడ్డి కి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్!
TGSPDCL FIELD WORKERS
జోరు వర్షంలోనూ మరమ్మతులు.. విద్యుత్ కార్మికుల సాహసం!
తెలుగురాష్ట్రాల్లో వరదలు..చిరంజీవి మనవి
PM Modi
ఆ ఘటనపై బహిరంగ క్షమాపణ చెప్పిన ప్రధాని మోదీ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions