Thursday 21st November 2024
12:07:03 PM
Home > తాజా > వసూళ్లకు పాల్పడితేకఠిన చర్యలు: సీఎం వార్నింగ్!

వసూళ్లకు పాల్పడితేకఠిన చర్యలు: సీఎం వార్నింగ్!

CM Revanth Reddy to Delhi regarding allocation of departments to ministers

CM Revanth Warning | హైద్రాబాద్ (Hyderabad) నగరంలో చెరువుల పరిరక్షణే ధ్యేయంగా హైడ్రా (Hydra) అక్రమ నిర్మాణాలను కూలుస్తున్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది హైడ్రా పేరుతో బెదిరింపులకు దిగుతూ, వసూళ్లకు పాల్పడుతున్నట్లు ముఖ్యమంత్రి దృష్టికి చేరింది.

దీంతో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అధికారులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. హైడ్రా పేరుతో కొంతమంది అధికారులు సామాన్యులను బెదిరింపులకు గురి చేస్తున్నట్లుగా ఫిర్యాదులు అందాయన్నారు.

మున్సిపల్, రెవెన్యూ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా తన దృష్టికి వచ్చిందన్నారు. గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డం పెట్టుకొని బెదిరిస్తున్నట్లుగా తెలిసిందన్నారు. అలాంటి వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అమాయకులను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తే ఎవ్వరైనా సరే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏసీబీ, విజిలెన్స్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

You may also like
cm revanth visits vemulawada
వేములవాడలో సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు!
eatala rajendar
లగచర్ల ఘటన స్కెచ్ కాంగ్రెస్ నాయకులదే: ఈటల రాజేందర్!
ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
పట్నం నరేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions