Friday 9th May 2025
12:07:03 PM
Home > తాజా > కొడంగల్ కు సీఎం రేవంత్..రూ.4 వేల కోట్ల పనుల శంకుస్థాపన

కొడంగల్ కు సీఎం రేవంత్..రూ.4 వేల కోట్ల పనుల శంకుస్థాపన

cm revath reddy

Cm Revanth Kodangal Tour| తెలంగాణ ( Telangana ) సీఎం గా బాధ్యతలు చేపట్టిన అనంతరం సొంత నియోజకవర్గం అయిన కొడంగల్ ( Kodangal ) లో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Cm Revanth Reddy ).

బుధవారం సాయంత్రం కొడంగల్ లో పర్యటించనున్న సీఎం రూ.4, 369 కోట్లు విలువ చేసే 20 పనులకు కోస్గి ( Kosgi ) ప్రభుత్వ పాఠశాల మైదానంలో శంకుస్థాపన చేయనున్నారు.

రూ.2,945 కోట్లతో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇది పూర్తి అయితే ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం కానుంది.

అలాగే కొడంగల్ లో వైద్య, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలల పనులకూ శ్రీకారం చుట్టనున్నారు.

గ్రామీణ ప్రాంత రోడ్ల ఏర్పాటుకు రూ. 213 కోట్లు, రూ.45 కోట్లతో కొడంగల్ మున్సిపాలిటీ ( Muncipality ) అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్.

అనంతరం సాయంత్రం 5 గంటలకు కోస్గిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సీఎం రేవంత్.

You may also like
‘BIG BREAKING : ఐపీఎల్ నిరవధిక వాయిదా’
‘జమ్మూలో ఏపీ జవాన్ వీరమరణం’
‘కుటుంబ సభ్యుల మృతి..భారత్ కు వార్నింగ్ ఇచ్చిన ఉగ్రవాది’
‘ఆపరేషన్ సింధూర్..ప్రధాని మోదీ ఫస్ట్ రియాక్షన్’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions