Chirnnjeevi Free Education | మెగాస్టార్ చిరంజీవి (Chirnajeevi) ఉగాది పర్వదినం సందర్భంగా ప్రకటించిన మరో బృహత్తర సేవా కార్యక్రమంపై ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందించారు.
అన్నయ్య తీసుకున్న నిర్ణయం ఆయన విశాల హృదయానికి నిదర్శనమని కొనియాడారు.
పేద విద్యార్థుల కోసం చిరు ‘జ్ఞాన యజ్ఞం‘
బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ మరియు ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా ఇప్పటికే లక్షలాది మందికి ప్రాణదానం చేసిన చిరంజీవి, ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి సారించారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పేద విద్యార్థుల చదువుల కోసం ఒక ప్రత్యేక సహాయక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఉగాది శుభవేళ ఈ ప్రకటన చేయడం మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
అన్నయ్యకు ‘తమ్ముడి‘ అభినందనలు
ఈ విషయంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.
“అన్నయ్య చిరంజీవి గారు ఉగాది శుభ సందర్భంలో పేద పిల్లలకు ఉచిత విద్య అందించాలనే సత్సంకల్పంతో కూడిన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ఆయన విశాల హృదయాన్ని చాటింది.
విద్యా దానం ద్వారానే జ్ఞాన వ్యాప్తి సాధ్యమవుతుంది. పేదల ఇళ్లలో జ్ఞాన జ్యోతులు వెలిగించాలనుకుంటున్న అన్నయ్యకు హృదయపూర్వక అభినందనలు. మీ సేవా గుణంతో మరెందరికో స్ఫూర్తిని అందిస్తున్నారు.” అని పేర్కొన్నారు.
విద్యా రంగంలో చిరంజీవి చేపట్టబోయే ఈ కొత్త విప్లవం అతి త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇది దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు వరంలా మారనుంది.






