Board Exams Twice a Year | పదో తరగతి, ఇంటర్ బోర్డు పరీక్షలకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు.
టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షలకు విద్యార్థులు రెండుసార్లు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు. 2025-26 అకడమిక్ ఈయర్ నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం పీఎం శ్రీ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బోర్డు పరీక్షలపై ఈ ప్రకటన చేశారు.
2020లో రూపొందించిన కొత్త జాతీయ విద్యా విధానంలో విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడం ఒకటని, ఈ క్రమంలో విద్యార్థులు రెండుసార్లు బోర్డు పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు.
2025-26 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులు రెండుసార్లు 10, ఇంటర్ విద్యార్థులు బోర్డు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.