Cash For Votes In Maharastra ? | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. ఈ క్రమంలో ఓటుకు నోట్లు పంచుతున్నారని బీజేపీ పై ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ ( Maha Vikas Aghadi ) కూటమి విమర్శలు గుప్పిస్తోంది.
కాగా ఎన్నికలకు కొన్ని గంటల ముందు మంగళవారం నాడు పాల్ఘర్ ( Phalghar ) జిల్లా విరార్ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్ ( Hotel ) లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి వినోద్ తావ్డే ( Vinod Tawde ) డబ్బులు పంచుతున్నారని స్థానిక బహుజన వికాస్ అఘాడీ నేతలు ఆరోపించారు.
నాలసోపరా నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి రాజన్ నాయక్ కు ఓటు వేయాలని వినోద్ తావ్డే డబ్బులు పంచుతున్నారని నేతలు ఆరోపించారు. అలాగే ఈ బీజేపీ నేత వద్ద రూ.5 కోట్లు, ఒక డైరీ లభించినట్లు వారు పేర్కొన్నారు.
ఎన్నికలను ప్రభావితం చేయడానికి బీజేపీ డబ్బులు పంచుతుందని కాంగ్రెస్ విమర్శించింది. వెంటనే ఎలక్షన్ కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలని హస్తం పార్టీ డిమాండ్ చేసింది. మరోవైపు ప్రతిపక్షాలు డబ్బుల కట్టలతో వచ్చి హంగామా చేశాయని బీజేపీ వస్తున్న ఆరోపణలను కొట్టివేసింది.