MLA Padi Kaushik Reddy | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదట ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సభ్యులు సంతాపం తెలిపారు.
అనంతరం ప్రశ్నోత్తరాల సెషన్ జరిగింది. ఈ సందర్భంగా BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరంలో మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లను బాంబులతో పేల్చినట్లు తన నియోజకవర్గంలో చెక్ డ్యాములను కూడా బాంబులతో పేల్చివేశారని ఆరోపించారు.
ఈ అంశంపై విచారణ జరపాలని కౌశిక్ రెడ్డి కోరారు. కరీంనగర్ జిల్లా తణుగుల చెక్ డ్యామ్ పేలుడును ఉదాహరణగా చూపుతూ ఆయన ఈ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఖండించారు.
సభలో కూర్చొని మాట్లాడటం కాదు.. ఘటనా స్థలానికి వెళ్తామని కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు చెక్ డ్యాముల అంశాన్ని నోట్ చేసుకున్నట్లు మంత్రి సీతక్క సభలో స్పష్టం చేశారు.









