BRICS Currency News | రష్యా ( Russia ) లోని ఖజాన్ ( Kazan ) నగరంలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ సదస్సులో భారత ప్రధాని మోదీ ( PM Modi ), రష్యా అధ్యక్షుడు పుతిన్ ( Putin ), చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ( Xi Jinping ), సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ అధినేతలు పాల్గొన్నారు.
అలాగే వీరితో పాటు ఇతర దేశాల అధినేతలు సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రిక్స్ దేశాల మధ్య జరిగే లావాదేవీలకు లోకల్ కరెన్సీ ని వినియోగించాలని పుతిన్ ప్రతిపాదించారు. డాలర్ కు పోటీగా ఈ కరెన్సీ రూపాంతరం చెందే అవకాశం ఉంది. దీన్నే డీ డాలరైజేషన్ ( De Dollarization ) అంటున్నారు.
ఇదిలా ఉండగా సదస్సులో భాగంగా బ్రిక్స్ కరెన్సీ నమూనాను పుతిన్ విడుదల చేసినట్లు తెలుస్తోంది. సదరు నోటుపై 100 విలువ అని రాసి ఉంది. నోటుకు ఓ వైపు భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా దేశాల పతాకం ఉంది.
అంతేకాకుండా నోటుపై తాజ్ మహాల్ ( Taj Mahal )చిత్రం కూడా దర్శనిమిచ్చింది. ప్రస్తుతం పుతిన్ చేతితో పట్టుకున్న బ్రిక్స్ కరెన్సీ నోటు నమూనా వైరల్ గా మారింది.