Border-Gavaskar Trophy Story | టెస్టు ( Test Series ) విభాగంలో ఆస్ట్రేలియా ( Australia ), ఇంగ్లాండ్ ( England ) దేశాల మధ్య జరిగే యాషెస్ ( Ashes ) అత్యంత ప్రతిష్ఠాత్మక సిరీస్ గా అభిమానులు పరిగణిస్తారు.
ఈ సిరీస్ కు తీసిపోని విదంగా టీం ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నువ్వా నేనా అనే విదంగా బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ( Border-Gavaskar Trophy ) జరుగుతుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పెర్త్ ( Perth ) వేదికగా ఈ సిరీస్ నవంబర్ 22న మొదలుకానుంది.
అయితే బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ఎప్పుడు మొదలైంది, దీని వెనుక ఉన్న నేపథ్యం ఏంటి అనే ఆసక్తి నెలకొంది. బోర్డర్ గావస్కర్ ట్రోఫీ 1996లో మొదలయింది. ఆ ఏడాది ఏకైక టెస్టు మ్యాచ్ కోసం ఆసీస్ టీం ఇండియాకు వచ్చింది.
ఈ క్రమంలో ఇరుజట్లకు విశేష సేవలందించిన సునిల్ గావస్కర్, అలెన్ బోర్డర్ పేర్ల మీద ఒక సిరీస్ నిర్వహిస్తే బాగుంటుందని భావించారు. అనంతరం బోర్డర్-గావస్కర్ ట్రోఫీఈ క్రమంలో ఇరుజట్లకు విశేష సేవలందించిన సునిల్ గావస్కర్, అలెన్ బోర్డర్ పేర్ల మీద ఒక సిరీస్ నిర్వహిస్తే బాగుంటుందని భావించారు. అనంతరం బోర్డర్-గావస్కర్ ట్రోఫీగా నామకరణం చేశారు. ఇలా మొదలైన ఈ సిరీస్ ఇప్పటికీ విజయవంతంగా సాగుతుంది.
తొలి సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. అలాగే ఇప్పటి వరకు ఈ సిరీస్ ను 16 సార్లు నిర్వహించగా 10 సార్లు టీం ఇండియా విజయం సాధించింది.