Thursday 19th September 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > బీజేపీ మిషన్ సౌత్.. దక్షిణాది రాష్ట్రాల్లో కాషాయ పార్టీ త్రిశూల వ్యూహం!

బీజేపీ మిషన్ సౌత్.. దక్షిణాది రాష్ట్రాల్లో కాషాయ పార్టీ త్రిశూల వ్యూహం!

bjp telangana

BJP Mission South | ఉత్తరాది పార్టీగా గుర్తింపు పొందిన భారతీయ జనతా పార్టీ ఈసారి 2024 ఎన్నికలే టార్గెట్ గా దక్షిణాది రాష్ట్రాలపై గట్టిగా ఫోకస్ చేసింది.

వచ్చే ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని వ్యూహరచన చేస్తోంది.  

అందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సౌత్ లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలనేది సమావేశం ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా 170 సీట్ల ను టార్గెట్ చేశారు.

ఈ సమావేశానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇంచార్జ్ ప్రకాష్ జవేదకర్, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు చెందిన బీజేపీ నాయకులు హాజరఅయ్యారు.

సౌత్ అంటే  దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, గోవా, అండమాన్ నికోబార్, లక్ష్వాద్వీప్, పుదుచ్చేరి కూడా భాగమే.

2024 లో జరగబోయే సార్వత్రిక  ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలను రచిస్తోంది.

అందులో భాగంగానే బీజేపీ భారతదేశాన్ని మూడు జోన్లగా విభజించింది. ఈస్ట్, నార్త్, సౌత్ జోన్లగా విభజించి త్రిశూల వ్యూహాన్ని బీజేపీ అనుసరరిస్తుంది.

సౌత్ జోన్ లో సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయిలో ఐక్యతను సాధించడం వంటి విషయాలు నిన్న జరిగిన సమావేశంలో చర్చించారు.

2024 ఎన్నికలకు రోడ్ మ్యాప్, ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యాచరణ అలాగే తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల వ్యూహం పై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.

2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనాన్ని సృష్టించింది. 543 సీట్లకు గాను బీజేపీ సొంతగా 303 సీట్లను కైవసం చేసుకుంది. కానీ అంతటి సునామీలో కూడా దక్షిణాన ఐదురాష్ట్రాల్లో బీజేపీ కి కెవలం 29 సీట్లు వచ్చాయి.

అందులో కర్ణాటకలోనే 25 మిగతా 4 తెలంగాణలో గెలుచుకుంది. మిగతా రాష్ట్రాల్లో బీజేపీ ఖాతా తెర్వలేకపోయింది.

కానీ ఇప్పుడు దక్షిణాన తమ పార్టీని బలోపేతం చెయ్యడం ద్వారా వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది.

ఇప్పటికే మహారాష్ట్రలో కుటమితో కలిసి అధికారంలో ఉన్న బీజేపీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 48 సీట్లకు గాను 23 సీట్లు బీజేపివే కానీ ప్రతిపక్షంలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన (ఉద్ధవ్ వర్గం) కలిసి మహా వికాస్ ఆఘాడి (MVA) కూటమి  రూపంలో బలంగా ఉంది.

అలాగే కర్ణాటక రాష్ట్రంలో కూడా పోయిన ఎన్నికల్లో 28 గాను 25 సీట్లు మరియు బీజేపీ సహకారంతో మరో అభ్యర్థి విజయాన్ని సాధించారు.

ఇలా 28 సీట్లకు గాను 26 బీజేపీ గెలిచింది. కానీ ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

ప్రాంతీయ పార్టీలదే హవా..

కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్యే పోటీ ఉండటం, ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రాంతీయ పార్టీలదే హవా ఉండటం బీజేపీకి అడ్డంకిగా మారాయి.

మరి ఇలాంటి తరుణంలో బీజేపీ ఏ విధంగా ముందుకు పోతుందనేది చూడాలి.

తమిళనాడు లో అన్నాడీఎంకే పార్టీతో పొత్తు ఉన్నా నిత్యం రెండు పార్టీల మధ్య విభేదాలు చెలరేగుతున్నాయి.

అందుకు పూర్తి భిన్నంగా డీఎంకే మరియు కాంగ్రెస్ కూటమి ప్రభుత్వంలో ఉండటం 2019 ఎన్నికల్లో 39 గాను 38 సీట్లు గెలిచారు. అన్నామలై నేతృత్వంలో బీజేపీ తమిళనాడులో ఎదగాలని చూస్తుంది.

తెలంగాణపై గంపెడాశలు..  

జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ గురుంచి ప్రత్యేకంగా చర్చించినట్టు సమాచారం. నాయకులు అందరూ ఐకమత్యంతో పని చెయ్యాలని సూచించినట్లు తెలుస్తోంది.

అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గంలో ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోవాలని పార్టీ అధ్యక్షుడు పలు కీలక సూచనలు చేసినట్లు సమాచారం.

అయితే తెలంగాణలో బీఆరెఎస్ పార్టీతో ఎటువంటి పొత్తు ఉండదని జేపీ నడ్డా స్పష్టం చేశారు.

You may also like
హైవే ను శుభ్రం చేసి, ట్రాఫిక్ క్లియర్ చేసి..శభాష్ పోలీసన్న
cm revanth
ఆ మీమ్స్ చూపిస్తే అసెంబ్లీకే అగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేవంత్ పుట్టినిల్లు బిఆర్ఎస్ పార్టీ అని మరవద్దు: నిరంజన్ రెడ్డి
cm revath reddy
సునితక్క ప్రచారం కోసం వెళ్తే నా పై రెండు కేసులు పెట్టారు : సీఎం రేవంత్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions