Bihar jewellery shops bans customers with hijabs and masks | బీహార్ రాష్ట్రంలో హిజాబ్, బుర్కా పై నిషేధం విధించారు జువెలరీ షాపు యజమానులు. ఇటీవల నగల దుకాణాల్లో దోపిడీలు అధికం అయ్యాయని పేర్కొంటూ ఆల్ ఇండియా జువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ ఇలా హిజాబ్, బుర్కా పై నిషేధం విధించింది. వీటితో పాటు నిఖాబ్, మాస్క్, హెల్మెట్, స్కార్ఫ్ మొదలైనవి ధరించినా నగల దుకాణంలో అనుమతించరు. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిన తరుణంలో కేటుగాళ్ళు జువెలరీ దుకాణాలే లక్ష్యంగా దోపిడీ చేసేందుకు యత్నిస్తున్నారు. అయితే వారిని గుర్తుపట్టకుండా ఉండేందుకు ముఖాన్ని కవర్ చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు వ్యాపారస్తులు వెల్లడించారు. ఇది కేవలం భద్రతా కోణంలో మాత్రమే చూడాలని, మతం కోణం ఇందులో లేదని జువెలరీ వ్యాపారులు పేర్కొన్నారు. జనవరి 8 నుండి బీహార్ నగరాల్లోని దుకాణాల్లో ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. మొఖం కనిపించకుండా ఎలాంటివి ధరించినా షాపుల్లోకి ఎంట్రీ ఉండబోదని తెలియజేస్తూ వ్యాపారులు నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు. గతంలో ఉత్తరప్రదేశ్ ఝాన్సీ పట్టణంలోని నగల వ్యాపారస్తులు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు.









