Wednesday 11th March 2026
12:07:03 PM
Home > క్రీడలు > రూ.131 కోట్ల నజరానా.. ఒక్కో ఆటగాడికి ఎంతంటే!

రూ.131 కోట్ల నజరానా.. ఒక్కో ఆటగాడికి ఎంతంటే!

Prize Money For T20 WC Winners | టీ-20 వరల్డ్ కప్ ను వరుసగా రెండవ సారి సాధించి టీం ఇండియా చరిత్ర సృష్టించిన విషయం తెల్సిందే. మొత్తంగా మూడు సార్లు పొట్టి ప్రపంచ కప్ ను ముద్దాడిన తొలి దేశంగా, ఆతిథ్యం ఇస్తూ కప్పు కొట్టిన తొలి దేశంగా భారత్ రికార్డు క్రియేట్ చేసింది.

ఆదివారం అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో న్యూజిలాండ్ జట్టును 96 పరుగులతో చిత్తుచేసిన టీం ఇండియా ఇలా పలు రికార్డులను ఖాతాలో వేసుకుంది. 150 కోట్ల భారతీయులను ప్రపంచ విజేతగా నిలిపిన టీం ఇండియా పై కాసుల వర్షం కురిపించింది బీసీసీఐ.

ఏకంగా రూ.131 కోట్ల భారీ నజరానాను ప్రకటించింది. 2024లో టీ-20 వరల్డ్ కప్ సాధించిన సమయంలో రూ.125 కోట్ల నజరానా ఇవ్వగా ఇప్పుడు మరో రూ.6 కోట్లను పెంచడం విశేషం. రూ.131 కోట్లలో అధిక భాగం ప్లేయర్లకు దక్కనుంది.

15 మంది ఆటగాళ్లకు చెరో రూ.6 కోట్లు దక్కనున్నట్లు తెలుస్తోంది. మిగిలిన రూ.41 కోట్లను సహాయక సిబ్బంది, ఇతరులకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి.

You may also like
‘పహల్గాం ఉగ్రవాదుల్ని పట్టుకోలేదు..అప్పుడే పాక్ తో మ్యాచులా?’
kohli retirement
రెడ్ బాల్ గేమ్ కు గుడ్ బై.. కొహ్లీ ఎమోషనల్ పోస్ట్!
rohith sharma
రోహిత్ శర్మ కోసం రూ.50 కోట్లు పక్కన పెట్టుకున్న రెండు టీంలు!
sachin tendulkar
ఆగస్ట్ 14.. సచిన్ కు చాలా స్పెషల్ డే.. విశేషమేంటంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions