Samantha Emotional Post | సినీ నటి సమంత (Samantha)కు అరుదైన అవకాశం దక్కింది. భారత 77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) ఏర్పాటు చేసిన ‘ఎట్ హోమ్’ (At Home) విందుకు ఆమెకు ఆహ్వానం లభించింది.
ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి హాజరైన అనంతరం సమంత సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన జీవితంలోలో ఇలాంటి ఒక రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదని పేర్కొన్నారు.
తన అదృష్టం, మాతృభూమి వల్లే ఇది సాధ్యమైందని సమంత ఆనందం వ్యక్తం చేశారు. “నా కెరీర్ లో నన్ను ప్రోత్సహించేవారు లేరు. ఎప్పటికైనా ఇలాంటి వేదికపై నిలుచుంటానని నా అంతరాత్మ కూడా చెప్పలేదు. ఎలాంటి మార్గం కనిపించలేదు.
ఇలాంటి కలలు కనడానికి కూడా అప్పట్లో సాహసించలేదు. కానీ నా పని నేను చేసుకుంటూ ముందుకు వెళ్లాను. ఈ దేశం నా కృషికి తగిన గుర్తింపు ఇచ్చింది. దీనికి ఎప్పటికీ రుణపడి ఉంటాను” అని రాసుకొచ్చారు.
రాష్ట్రపతి భవన్‌లో దిగిన పలు ఫొటోలను, విందుకు సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని కూడా ఆమె షేర్ చేశారు.







