Actress Nidhi Agarwal Mobbed at Hyderabad Lulu Mall | అభిమానుల అత్యుత్సాహం ప్రదర్శించడంతో నటి నిధి అగర్వాల్ తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. భద్రత వైఫల్యం మూలంగా అభిమానులు నిధి అగర్వాల్ చుట్టూ గుమిగూడారు. కొందరు అయితే ఆమెను తాకేందుకు యత్నించారు. దింతో ఈ హీరోయిన్ ఆందోళనకు గురయ్యారు. కారులో ఎక్కిన తర్వాతనే ఆమె ఊపిరి పీల్చుకోగలిగారు.
ప్రభాస్-మారుతి కాంబోలో తెరకెక్కిన ‘ది రాజాసాబ్’ జనవరి 9న విడుదల కానుంది. ఈ క్రమంలో బుధవారం హైదరాబాద్ లోని లూలు మాల్ లో ఏర్పాటు చేసిన ఈవెంట్ లో సినిమాలోని ‘సహానా’ అనే పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి నిధి అగర్వాల్ హాజరయ్యారు. అనంతరం ఆమె తిరిగి కారు వద్దకు వెళ్తున్న సమయంలో హీరోయిన్ కు చేదు అనుభవం ఎదురైంది. అభిమానులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. సెల్ఫీల కోసం ఎగబడ్డారు. కొందరు ఆమెను తాకేందుకు ప్రయత్నించారు.
ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో నిధి కారు ఎక్కేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బౌన్సర్ల సహాయంతో అతి కష్టం మీద కారు ఎక్కగలిగారు. దింతో అభిమానుల ప్రవర్తన పట్ల ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిర్వాహకులు తగిన రీతిలో భద్రత ఏర్పాట్లు చేయలేదనే విమర్శలు వస్తున్నాయి.









