Tuesday 13th May 2025
12:07:03 PM
Home > తాజా > ‘సప్త వర్ణాలు’ సినిమా పోస్టర్ ఆవిష్కరించిన గీతా భాస్కర్!

‘సప్త వర్ణాలు’ సినిమా పోస్టర్ ఆవిష్కరించిన గీతా భాస్కర్!

sapta varnalu poster launch
  • కేబీకే ఎంటర్టైన్మెంట్, భవ్యాస్ మీడియా నిర్మాణం
  • కేబీకే గ్రూప్ ఉద్యోగినులతో మహిళ దినోత్సవ కార్యక్రమం

కపోతం, హైదరాబాద్: మహిళ జీవితం కథాంశంగా తెరకెక్కుతున్న ‘సప్త వర్ణాలు’ ఇండిపెండెంట్ సినిమా పోస్టర్ ను ప్రముఖ నటి, ఇండ్ ఫేమ్ సీఈవో గీతా భాస్కర్ (Geetha Bhascker) ఆవిష్కరించారు.

కేబీకే ఎంటర్టైన్మెంట్స్, భవ్యాస్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కేబీకే గ్రూప్ అధినేత కక్కిరెణి భరత్ కుమార్ (Kakkireni Bharath Kumar) నిర్మిస్తున్నారు. వెంకట్ నాగరాజు దర్శకత్వం వహిస్తున్నారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం కేబీకే గ్రూప్ ప్రధాన కార్యాలయం నిర్వహించిన వేడుకల్లో గీతా భాస్కర్ పాల్గొని ఈ సినిమా పోస్టర్ ఆవిష్కరించి, గ్లింప్స్ వీక్షించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం మహిళ దినోత్సవం సందర్భంగా కేబీకే గ్రూప్ ఉద్యోగినులతో గీతా భాస్కర్ ముచ్చటించారు. తన జీవితంలో ఎదురైన ఇబ్బందులు, ఎదుర్కున్న తీరును వివరించారు. ప్రస్తుత టెక్నాలజీ పోటీ ప్రపంచంలో రాణించాలంటే మహిళ అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై ఉద్యోగినులకు సూచనలు చేశారు.

You may also like
Jahnvi kapoor
మగాళ్లకు పీరియడ్స్ వస్తే.. జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ntr neel movie
NTRNeel సినిమా నుంచి కీలక అప్ డేట్!  
allu arjun gets interim bail
అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సర్ప్రైజ్.. క్రేజీ వీడియో రిలీజ్!
Ram Charan
రామ్ చరణ్ కొత్త సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions