A Businessman Returned Rs. 37 Stolen 50 Years Ago With Huge Interest | చిన్నతనంలో దొంగిలించిన డబ్బులను ఓ వ్యాపారవేత్త ( Businessman ) 50 ఏళ్ల తర్వాత తిరిగి ఇచ్చేసారు. అయితే ఆయన దొంగిలించింది లక్షల రూపాయలు కాదు. కేవలం రూ.37.
వివరాల్లోకి వెళ్తే 1970 కాలంలో శ్రీలంక ( Srilanka ) లోని తేయాకు తోటల్లో సుబ్రమణ్యం, ఎలువాయి దంపతులు పనిచేసేవారు. ఈ దంపతులు తమ ఇంటిని కాళీ చేసి వేరే ప్రాంతానికి వెల్లలనుకున్నారు.
సామాన్లు తరలించడానికి ఇంటిపక్కన ఉండే రంజిత్ ( Ranjith ) సహాయం తీసుకున్నారు. సామాన్లు సర్దుతున్న సమయంలో దిండు కింద రంజిత్ కు రూ.37.50 పైసలు కనిపించాయి. వెంటనే వాటిని తన జేబులో పెట్టుకున్నారు.
డబ్బులు తీశావా అని ఆ దంపతులు అడిగినా తీయలేదు అని రంజిత్ అబద్ధం చెప్పారు. 1997లో రంజిత్ శ్రీలంక నుండి తమిళనాడు లోని కోయంబత్తూరు ( Coimbatore ) కు వచ్చి వ్యాపారం మొదలుపెట్టారు. క్రమంగా వ్యాపారం పెద్దదయ్యింది.
అనారోగ్యంగా ఉన్న సమయంలో ఈయన ఒకసారి బైబిల్ ( Bible ) చదివారు. అందులో నీతిమంతులు తీసుకున్న అప్పును చెల్లిస్తారు అనే వ్యాఖ్యము ఆయన్ను ఆలోచింపజేసిందంట.
దింతో 2024 ఆగస్ట్ నెలలో శ్రీలంక వెళ్లి సుబ్రమణ్యం, ఎలువాయి దంపతుల వారసులను కలిశాడు. ముగ్గరు వారసులకు కొత్త బట్టలతో పాటు ఒక్కొక్కరికి రూ.70 వేలు ఇచ్చాడు. ఇలా 50 ఏళ్ల తరువాత దొంగిలించిన డబ్బును రంజిత్ తిరిగిచ్చేసాడు.