Chiranjeevi Honours Padma Awardees | భారత 77 వ గణతంత్ర దినోత్సవం (Republic Day) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మ పురస్కారాలను (Padma Awards) ప్రకటించిన విషయం తెలిసిందే.
అందులో భాగంగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటులు మురళీ మోహన్ (Murali Mohan), రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad)లు పద్మశ్రీ (Padma Sri) అవార్డులకు ఎంపిక అయ్యారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఈ పద్మ అవార్డుల గ్రహీతలకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. మంగళవారం చిరంజీవి స్వయంగా మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌ల నివాసాలకు వెళ్లి మరీ వారికి శుభాకాంక్షలు తెలిపారు.
వారిని శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.అంతకు ముందు ఈ పద్మ పురస్కారాలు లభించిన వారందరికీ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు మెగాస్టార్.
“ఇలాంటి విశిష్ట వ్యక్తులను సత్కరించడం గొప్ప గర్వాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రీ ధర్మజీ గారికి పద్మ విభూషణ్, నా ప్రియమైన స్నేహితుడు మమ్ముట్టీ, డాక్టర్ దత్తాత్రేయుడు నోరి గారికి పద్మ భూషణ్ పురస్కారాలు దక్కడం దశాబ్దాల అంకితభావం, ప్రతిభకు దక్కిన గౌరవం.
మిత్రులు మురళీ మోహన్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, సోదరుడు మాధవన్ గారు, మన చాంపియన్ రోహిత్ శర్మ, అలాగే వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు పద్మశ్రీ లభించడం ఎంతో సంతోషంగా ఉంది.
కళలు, విజ్ఞానం, వైద్యం, సాహిత్యం, క్రీడలు వంటి రంగాల్లో విశేష సేవలు అందించిన 2026 సంవత్సరపు పద్మ అవార్డు గ్రహీతలకు నా హృదయపూర్వక అభినందనలు” అని రాసుకొచ్చారు చిరంజీవి.









