Mrunal Dhanush Wedding Photo | సోషల్ మీడియా (Social Media) మరోసారి సినీ అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. నటీనటులు మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), ధనుష్ (Dhanush) పెళ్లి పీటలపై కూర్చున్నట్లుగా కనిపించే ఒక ఫోటో క్షణాల్లోనే వైరల్‌గా మారింది.
చెన్నైలో జరిగిన సీక్రెట్ వెడ్డింగ్ అంటూ ప్రచారం జరగడంతో, అభిమానులు శుభాకాంక్షలతో వెల్లువెత్తారు. కానీ ఇది నిజంగా జరిగిన పెళ్లి కాదు. ఇటీవల ఈ ఇద్దరిపై రూమర్స్ రావడంతో ఫ్యాన్స్ ఎవరో AI సహాయంతో ఈ ఫొటోను సృష్టించినట్లు తేలింది.
నిజానికి, ఇది టెక్నాలజీ చూపించిన మాయ మాత్రమే. ఫోటోలో మృణాల్ మెరూన్ రంగు కంచి పట్టు చీరలో సంప్రదాయ వధువుగా మెరిసిపోతుండగా, ధనుష్ దక్షిణ భారత సంప్రదాయ దుస్తుల్లో వరుడిలా కనిపించాడు.
మరింత ఆసక్తికరంగా, త్రిష, శృతి హాసన్, అనిరుధ్, విజయ్, దుల్కర్ సల్మాన్, అజిత్ వంటి స్టార్ నటీనటులు కూడా పెళ్లి అతిథులుగా కనిపించారు.









