– చిరు సినిమాపై అల్లు అర్జున్ ప్రశంసలు!
Allu Arjun Praises Chiru Movie | మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా మన శంకర వర ప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu) సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
300 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. సినిమా చూసిన ఆయన సినిమా టీమ్ మొత్తానికి అభినందనలు తెలిపారు.
బాస్ ఈజ్ బ్యాక్.. మన మెగాస్టార్ ని మళ్లీ ఇలా చూడటం చాలా ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. వెంకీ గౌడగా వెంకటేశ్ షేక్ చేశారని ప్రశంసించారు. నయనతార, బుల్లిరాజుతోపాటు సినిమాలో నటులంతా అదరగొట్టారనీ రాసుకొచ్చారు.
మెగా – విక్టరీ కాంబినేషన్, చిరంజీవి హుక్ స్టెప్, భీమ్స్ మ్యూజిక్ అన్ని ఉన్నతంగా ఉన్నాయని కితాబిచ్చారు. నిర్మాతలు సుష్మితా కొణిదెల, సాహు గారపాటితోపాటు సినిమా బృందం మొత్తానికి కంగ్రాట్స్ చెప్పారు అల్లు అర్జున్. ఇది సంక్రాంతి బ్లాక్ బస్టర్ కాదు.. బాస్ బస్టర్ అని కొనియాడారు.









