CP VC Sajjanar | ఇటీవల కాలంలో లక్కీ డ్రా (Lucky Draw) ట్రెండ్ వైరల్ అవుతోంది. కొంతమంది తమ భూమి, ఇల్లు, కార్లు, టూవీలర్లను లక్కీ డ్రా పేరుతో విక్రయిస్తున్నారు. వీటిని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రచారం చేయిస్తున్నారు.
అయితే కొంతమంది కూపన్లు అమ్ముతూ లక్కీ డ్రా పేరుతో మోసాలకు పాల్పడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సోషల్ మీడియా ఇన్ఫుయెన్సర్లకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ (CP VC Sajjanar) వార్నింగ్ ఇచ్చారు.
‘మిమ్మల్ని నమ్మి జనాలు ఫాలో అవుతున్నరంటే ఏదన్నా మంచి కంటెంట్ చేయండ్రి. అంతేగానీ, పైసల కోసం జనాన్ని మాత్రం దోచుకోకండ్రి! ఒక్కటి యాది పెట్టుకోండ్రి… కర్మ ఎవ్వర్నీ ఇడిసిపెట్టదు. అది ఎక్కడికో ఎత్తుకపోయి, మల్లా గొయ్యి తీసి పూడ్చేస్తది!
చేసేది మోసం అని మీ మనసుకి తెల్సు కదా? చట్టాన్ని లైట్ తీసుకుంటే చివరకు సీన్ సితార్ అయితది. అంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు సీపీ. లక్కీ డ్రా పేరుతో మోసాలు జరుగుతాయంటూ ఓ యువకుడు చేసిన అవగాహన వీడియోను షేర్ చేశారు సీపీ సజ్జనార్.









