- వీధి కుక్కల అంశంపై కీలక వ్యాఖ్యలు!
Renu Desai Pressmeet | సినీ నటి, సామాజిక కార్యకర్త రేణు దేశాయ్ (Renu Desai) రోడ్లపై వీధి కుక్కల సంరక్షణపై (Stray Dogs) కీలక వ్యాఖ్యలు చేశారు. వీధి కుక్కలను చంపడంపై ఆమె తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఇటీవల కొన్ని ఏరియాలలో వీధి కుక్కలను చంపినట్లు వచ్చిన వార్తలపై రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కలు కరవడం వల్ల చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని, రేబిస్ వ్యాధి వస్తోందని, రోడ్లపై బైకులపై ప్రయాణిస్తున్న వారిని వెంబడించడం వల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయని అంటున్నారు.
మనుషుల ప్రాణాల గురించి మాట్లాడేవారు.. మీకు నిజంగా మనుషుల మీద అంత కరుణ, దయ ఉంటే.. రోజూ యాక్సిడెంట్స్ వల్ల లక్షలమంది చనిపోతున్నారు. ఆ ప్రాణాలకు విలువ లేదా?. దోమకాటు వల్ల ఏడాదికి ఎంతోమంది చచ్చిపోతున్నారు. ఆ ప్రాణాలకు విలువ లేదా?” అని రేణు దేశాయ్ ప్రశ్నించారు.
రోజూ ఎన్ని హత్యలు జరుగుతున్నాయి? ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి? అప్పుడు మీ మానవత్వం ఎక్కడికి పోయింది?” అని రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుద్ధి ఉంటే ఒక్కసారి కుక్కల గురించి కూడా ఆలోచించాలని అన్నారు.
అంత ప్రేమ ఉంటే కుక్కల్ని ఇంట్లో పెట్టుకోమంటున్నారు కదా.. మరి పేదవాళ్లని ఇంట్లో పెట్టుకోండి.. సాయం ఎందుకు చేస్తారు? అని రేణు ప్రశ్నించారు. ప్రతిరోజు తాను కుక్కలను కాపాడుతున్నానని, వాటి కోసం లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నానని ఆమె చెప్పారు.









