MK Stalin slams Censor Board over Vijay’s Jana Nayagan | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సెర్టిఫికేషన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. సెన్సార్ బోర్డు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి కొత్త ఆయుధంగా మారిందని మండిపడ్డారు. అందరూ ఈ ధోరణిని తీవ్రంగా ఖండించాలన్నారు. కాగా దళపతి విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యం అవ్వడంతో విడుదలకు నోచుకోని విషయం తెల్సిందే. ఈ క్రమంలో విజయ్ కు మద్దతుగా ఇప్పటికే కోలీవుడ్ ప్రముఖులు స్పందిస్తున్నారు.
ఇదే సమయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్ధులను లక్ష్యంగా చేసుకుని ఈడీ, సీబీఐ, ఐటీ వంటి ఆయుధాలతో దాడి చేస్తుందని తాజగా ఇందులో సెన్సార్ బోర్డు కూడా చేరిందని మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టేందుకు కేంద్రం సెన్సార్ బోర్డును వినియోగిస్తుందని ఆరోపించారు. ఇకపోతే ముఖ్యమంత్రి విమర్శలను బీజేపీ ఖండించింది. ఇదిలా ఉండగా టీవీకే పార్టీ స్థాపించిన విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అతి త్వరలో జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. జన నాయగన్ సినిమానే తన చివరి మూవీ అని కూడా ప్రకటించారు. కానీ ఈ సమయంలో సెన్సార్ సర్టిఫికేట్ ఆలస్యం అవ్వడంతో మూవీ వాయిదా పడడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.









