Owaisi urges Modi to bring 26/11 masterminds from Pakistan | హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాదిరిగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పాకిస్థాన్ కు సైన్యాన్ని పంపి ముంబయిలో 26/11 ఉగ్రదాడి వెనుక ఉన్న మాస్టర్ మైండ్స్ ను పట్టుకురావలని డిమాండ్ చేశారు. తాజగా అమెరికా సైన్యం వెనెజువెలా దేశంపై సైనిక చర్య జరిపి ఆ దేశ అధ్యక్షుడు నోకొలస్ మధురోను మరియు ఆయన భార్యను బంధించి అమెరికా తీసుకెళ్లిన విషయం తెల్సిందే.
ఈ ఘటనను ప్రస్తావించిన ఒవైసీ ప్రధాని మోదీ కూడా పాకిస్థాన్ లో నక్కిన ఉగ్రవాదులపై ఇలాంటి చర్య తీసుకోవాలన్నారు. ఈ మేరకు ముంబయి లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. ముంబయి నగరంలో ఉగ్ర కుట్ర పన్నిన క్రూరులు మసూద్ అజర్ అయినా సరే లేదా లష్కరే తోయిబా అయినా పాకిస్థాన్ నుంచి ఈ ముష్కరులను ఎందుకు తీసుకురాకూడదు అని అడిగారు. తనది 56 ఇంచుల ఛాతీ అని చెప్పుకునే మోదీ సైన్యాన్ని పంపి ఉగ్రవాదులను ఎందుకు తీసుకురారు అని వ్యంగ్యంగా ప్రశ్నించారు.









