Monday 12th January 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చి’..రేవంత్ రెడ్డి సంచలనం

‘చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చి’..రేవంత్ రెడ్డి సంచలనం

CM Revanth Reddy Revels Shocking Facts on Rayalaseema Lifting Irrigation Project | తెలంగాణ శాసనసభలో సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శనివారం సభలో ‘నీళ్లు-నిజాలు’ చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను ఆపించిన చరిత్ర తనది అని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణ కొనసాగాలనే ఉద్దేశ్యంతో తాను సాధించిన ఈ విజయాన్ని ఇప్పటి వరకు బయటకు చెప్పుకోలేదన్నారు.

‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపితేనే ఏ విషయంపై అయినా చర్చించడానికి సిద్ధం, లేదంటే లేదు అని చంద్రబాబును విజ్ఞప్తి చేశాం. రోజుకు 3 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించే లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపాలని క్లోజుడ్ రూంలో కోరం. మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఏపీ సీఎం చంద్రబాబు ఆపేశారు’ అని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోయాయి, అవసరమైతే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు నాయకత్వంలో నిజనిర్దారణ కమిటీ వేయాలని స్పీకర్ ను కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

You may also like
అల్లు అర్జున్ పాట పాడి అదరగొట్టిన కేంద్రమంత్రి
చెప్పులు లేకుండా రోడ్డుపై రౌడీలు..గుంటూరు పోలీసుల తీరే వేరు!
‘హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారు’..ఒవైసీ vs బండి
సైబర్ వలలో జేడీ లక్ష్మీనారాయణ సతీమణి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions