Danam Nagender News | తెలంగాణ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం జరిగిన సభలో ఓ ఆసక్తికరమైన అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రశ్నోత్తరాల సమయంలో మూసి ప్రక్షాళనపై మాట్లాడారు. అయితే ఈ సమయంలో ‘శ్రీ దానం నాగేందర్ (బీఆరెస్), ఖైరతాబాద్’ అని స్క్రీన్ పై ప్రత్యక్షం అయ్యింది. ఇప్పుడు ఈ ఫోటో వైరల్ గా మారింది. దానం నాగేందర్ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ ఖండువా కప్పుకున్నారు.
ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి అయినా సిద్ధమే అని ఉప ఎన్నికల్లో మళ్లీ గెలుస్తా అంటూ దానం పలుసార్లు వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల వేళ సభలో మాట్లాడుతున్న సమయంలో దానం నాగేందర్ ను ఇప్పటికీ బీఆరెస్ ఎమ్మెల్యేగా పేర్కొనడం ఆసక్తిగా మారింది.









