AP Deputy CM Pawan Kalyan to Visit Kondagattu temple | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో పర్యటించనున్నారు. కొండగట్టులో ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం రూ.35.19 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఏపీ ఎన్నికల ప్రచారం సమయంలో పవన్ కొండగట్టుకు వచ్చారు. ఈ క్రమంలో భక్తుల సౌకర్యార్థం గదులు, ధర్మశాల, మాల విరమణ మండపం కోసం సహకరించాలని ఆలయ అర్చకులు కోరారు.
దింతో తాజగా పవన్ సిఫారసు మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కొండగట్టు అభివృద్ధి కోసం నిధులు విడుదల చేసింది. ఈ పనులకు శంకుస్థాపన చేసేందుకు పవన్ కొండగట్టు రానున్నారు. టీటీడీ నిధులతో కొండగట్టులో నిర్మించ తలపెట్టిన గదుల నిర్మాణ స్థలానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత జనసేన పార్టీ నేతలు, జనసైనికులతో పవన్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు.









