CM Revanth Chit Chat | తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం రేవంత్ (CM Revanth Reddy) మాజీ సీం కేసీఆర్ ల (CM KCR) పలకరింపుపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఈ విషయంపై స్పందించారు.
కేసీఆర్ ను తాను ముఖ్యమంత్రి హోదాంలో కలవడం ఇదేం తొలిసారి కాదని అని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు కలిశాను కదా అని గుర్తు చేశారు.
నేను సభా నాయకుడ్ని కాబట్టి అందరినీ గౌరవిస్తాననీ, అందుకే కేసీఆర్ ని పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నా అని చెప్పారు. అయితే కేసీఆర్ అంత త్వరగా సభ నుంచి వెళ్లిపోవడం మీడియా ప్రశ్నించగా, ఆ విషయం ఆయన్నే అడగాలని సూచించారు.









