Rajinikanth announces Sequel for his Iconic Film | సూపర్ స్టార్ రజినీ కాంత్ సినీ కెరీర్ లో నరసింహ సినిమాది చాలా ప్రత్యేక స్థానం. ఆ సినిమాలో నరసింహ గా రజినీకాంత్, నీలాంబరి గా రమ్యకృష్ణ నట విశ్వరూపం చూపారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి రజినీకాంత్ కీలక ప్రకటన చేశారు. ‘నరసింహ’ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించనున్నట్లు వెల్లడించారు. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించిన నరసింహ సినిమాకు స్వయంగా రజినీకాంత్ కథను రాశారు.
1999లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో పాత రికార్డులను వెనక్కు నెట్టేసి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇందులో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర సినిమాకే హైలెట్ గా నిలిచింది. కాగా డిసెంబర్ 12న రజినీకాంత్ పుట్టినరోజు. ఈ క్రమంలో నరసింహ సినిమాను రీరిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రజినీకాంత్ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఇందులో నరసింహ సినిమా విశేషాలను పంచుకున్నారు.
తొలుత నీలాంబరి పాత్ర కోసం ఐశ్వర్యారాయ్ ఆ తర్వాత మాధురి దీక్షిత్ వంటి హీరోయిన్లను అనుకున్నట్లు కానీ పాత్రకు రమ్యకృష్ణ అయితేనే న్యాయం చేయగలదని తుది నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. రోబో 2.0, జైలర్ 2 చేస్తున్నప్పుడు తనకు నరసింహ-2 ఎందుకు తీయకూడదు అని ఆలోచన వచ్చినట్లు రజిని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సీక్వెల్ కు సిద్ధం అయినట్లు చెప్పారు. ‘నీలాంబరి’ అనే టైటిల్ తో ఈ సినిమా రాబోతున్నట్లు రజిని ప్రకటించారు. దీనికి సంబంధించిన కథపై ప్రస్తుతం వర్క్ నడుస్తున్నట్లు సూపర్ స్టార్ కీలక అప్డేట్ ఇచ్చారు.









