Father Breaks Down Amid IndiGo Flight Chaos | ఇండిగో గందరగోళం మూలంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వరుసగా నాలుగు రోజుల పాటు ఇండిగో విమానాలు రద్దవుతున్న క్రమంలో కనీస సౌకర్యాలు, ఆహారం లేకపోవడంతో ప్రయాణికుల ఆగ్రహం కట్టలు తెచుకుంటుంది. ఇదే సమయంలో ఓ తండ్రి ఆవేదనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ‘నా కూతురికి సానిటరీ ప్యాడ్ కావాలి. రక్తం కారుతుంది’ అని ఆ తండ్రి ఆవేదన భరితమైన ఆగ్రహం అందర్నీ కలిచివేసింది.
నిర్వాహణపరమైన లోపల కారణంగా ఇండిగో విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. ఇండిగో నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు దయనీయ పరిస్థితిని ఎదురుకుంటున్నారు. గంటల తరబడి ఎయిర్ పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. కానీ ప్రయాణికుల బాగోగుల గురించి ఆలోచించే నాధుడే లేడు. కనీస సౌకర్యాలు కూడా అందడం లేదు. ఇదే సమయంలో తన కూతురికి నెలసరి వచ్చిందని ఒక సానిటరీ ప్యాడ్ ఇవ్వాలని ఓ తండ్రి ఓ విమానాశ్రయంలో ఉండే కస్టమర్ అసిస్టెంట్స్ ను అభ్యర్ధించారు. రక్తం కారుతుంది, ఓ సానిటరీ ప్యాడ్ ఇవ్వాలని కోరారు.
అయితే అక్కడి సిబ్బంది మాత్రం మేము సహాయం చేయలేము అని ఏమాత్రం మానవత్వం లేకుండా నిస్సిగ్గుగా సమాధానం చెప్పడంతో ఆ తండ్రికి విపరీతమైన ఆగ్రహం వచ్చింది. కూతురు ఇబ్బంది పడుతుంటే సహాయం చేయలేని దుస్థితిలో ఆ తండ్రి ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇండిగో సంస్థపై, విమానాశ్రయ సిబ్బందిపై, అధికారుల తీరు నిర్లక్ష్యంపై ప్రయాణికులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.









