Samantha Family Photo | స్టార్ హీరోయిన్ సమంత (Samantha) బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru) డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో (Esha Yoga Centre) పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
వివాహం అనంతరం ఫోటోలు బయటకు రావడంతో ఫ్యాన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా సమంత తన మెట్టింట అడుగు పెట్టారు. భర్తతో కలిసి అత్తింటికి వెళ్లిన ఆమెకు ఆ కుంటుంబం నుంచి ఆత్మీయ స్వాగతం లభించింది.
ఈ సందర్భంగా దిగిన ఒక ఫ్యామిలీ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోను స్వయంగా రాజ్ సోదరి శీతల్ షేర్ చేశారు. ఫోటోలో సమంత, రాజ్, ఆయన తల్లిదండ్రులు, శీతల్, ఆమె ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ ఫోటోను షేర్ చేస్తూ శీతల్ ఎమోషనల్ పోస్ట్ రాసుకొచ్చారు.
“నా సంతోషాన్ని వ్యక్తపరచడానికి మాటలు రావడం లేదు. ఈరోజుతో మా కుటుంబం పరిపూర్ణమైంది. సమంత–రాజ్ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నా. పరస్పర గౌరవం, నిజాయతీ ఉన్నప్పుడే ఆ వివాహ బంధం అందంగా మారుతుంది. సమంతకు మేమంతా జీవితాంతం తోడుగా ఉంటాం” అని ఆమె రాసుకొచ్చారు. ఈ పోస్ట్ పై స్పందించిన సమంత లవ్ యూ అని రిప్లై ఇచ్చింది.








