Chikiri Song Making | గ్లోబల్ స్టార్ రాంచరణ్, జాన్వీ కపూర్ జంటగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న మూవీ ‘పెద్ది’. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా నుండి విడుదల అయిన ‘చికిరి’ పాట బ్లాక్ బస్టర్ అయ్యింది. మరీ ముఖ్యంగా ఇందులోని హుక్ స్టెప్ ట్రెండింగ్ గా మారింది. నెటిజన్లు రాంచరణ్ హుక్ స్టెప్ ను చేస్తూ సదరు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే 100 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది.
ఈ క్రమంలో మూవీ టీం చికిరి పాట మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఇందులో చికిరి హుక్ స్టెప్ కోసం రాంచరణ్ మరియు మూవీ టీం చాలా కష్టపడింది. 45 నిమిషాల పాటు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లి ఓ స్పెషల్ లొకేషన్ లో షూట్ చేశారు. అలాగే బుచ్చిబాబు-రాంచరణ్ మధ్య జరిగిన ఫన్నీ సంభాషనను సైతం మేకర్స్ విడుదల చేశారు. ఇందులో బుచ్చిబాబును థలా అని రాంచరణ్ పిలవడం విశేషం. ఇకపోతే వచ్చే ఏడాది మార్చ్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.









