BAD news for Virat Kohli fans! No IPL in Bengaluru | ఐపీఎల్ లో భాగమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆర్సీబీ అమ్మకానికి ఉందని, వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఐపీఎల్-2026 సీజన్ లో ఆర్సీబీ తమ సొంత మైదానం అయిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం లేనట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆర్సీబీ హోం మ్యాచులు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే చర్చలు తుదిదశకు చేరినట్లు కథనాలు వస్తున్నాయి. 2025లో సుధీర్ఘ 18 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఫైనల్స్ లో పంజాబ్ పై బెంగళూరు ఘన విజయం సాధించి తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. అయితే ఈ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. బెంగళూరులో నిర్వహించ తలపెట్టిన విక్టరీ పరేడ్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది.
చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అభిమానుల భద్రత దృష్ట్యా చిన్నస్వామి సురక్షితం కాదని ప్రభుత్వం ప్రకటించింది. మ్యాచులు జరగకుండా సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో 2026లో జరగబోయే ఐపీఎల్ లో భాగంగా బెంగళూరు తమ హోం మ్యాచులను పూణేలో ఆడే అవకాశం ఉంది.









