Cricketer aks PM Modi about his secret skincare routine | ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు మహిళా క్రికెటర్ హార్లీన్ డియోల్. ‘మోదీ గారు మీ చర్మం ఎప్పుడూ మెరుస్తూనే ఉంటుంది, మీ స్కిన్ కేర్ సీక్రెట్ ఏంటో చెప్పగలరా’ అని క్రికెటర్ ప్రశ్నించింది.
దీనికి ప్రధాని ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. మహిళల ప్రపంచ కప్పును భారత్ కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో బుధవారం టీం ఇండియా ప్రధానితో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ప్రధాని ప్లేయర్లను అభినందించారు. ప్లేయర్ల ఐక్యత, ధైర్యం మరియు ప్రతీకుల పరిస్థితుల్లో కూడా విజయం సాధించిన తెగువను కీర్తించారు. అనంతరం ప్లేయర్లు ఒక్కొక్కరిగా ప్రధానితో మాట్లాడారు. ఇందులో భాగంగా హార్లీన్ డియోల్ మాట్లాడుతూ ‘మోదీ గారు మీ స్కిన్ ఎప్పుడూ మెరుస్తూనే ఉంటుంది.
మీ స్కిన్ కేర్ సీక్రెట్ ఎంటో చెప్పగలరా’ అని అడిగింది. దింతో ప్రధానితో సహా అక్కడున్న ప్లేయర్లు నవ్వేశారు. అనంతరం మోదీ స్పందిస్తూ దానిపై తాను పెద్దగా ఆలోచించనని తెలిపారు. ఇదే సమయంలో ఆల్ రౌండర్ స్నేహ్ రాణా స్పందిస్తూ..ఇది దేశ ప్రజల ప్రేమ వళ్లే అని అన్నారు. వెంటనే మోదీ ‘అవును ఇది నిజమే. ప్రజల ఆశీర్వాదాలు ప్రభావం చూపిస్తాయి’ అని అన్నారు.









