AIADMK Slams CM Stalin As Google Goes To Andhra | దిగ్గజ టెక్ సంస్థ ఏపీలోని విశాఖపట్నంలో రాబోయే ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది. డేటా సెంటర్ తో పాటుగా వైజాగ్ ను ఏఐ హబ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ పట్టుబడులు పెడుతున్నట్లు గూగుల్ స్పష్టం చేసింది.
విశాఖలో గూగుల్ పెట్టుబడి తమిళనాడులో రాజకీయ దుమారానికి కారణం అయ్యింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఒక తమిళ వ్యక్తి, అయినప్పటికీ గూగుల్ ను తమిళనాడుకు తీసుకురావడంలో అధికారంలోని డీఎంకే విఫలం అయ్యిందని ఏఐడీఎంకే విమర్శలు గుప్పించింది. సుందర్ పిచాయ్ మదురైలో పుట్టి పెరిగారని, అయినప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా భారీ పెట్టుబడి విశాఖకు తరలిపోయిందని అన్నా డీఎంకే నాయకులు ఆర్బీ ఉదయకుమార్ మండిపడ్డారు. డీఎంకే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే గూగుల్ తమిళనాడుకే వచ్చేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి, డీఎంకే నేత స్పందించారు. గూగుల్ పెట్టుబడుల కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేయలేదనే విమర్శల్లో అర్ధం లేదన్నారు. అలాగే ఫాక్స్ కాన్ త్వరలోనే రాష్ట్రంలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు స్పష్టం చేశారు.









