Bishop Cotton students give emotional farewell to bell ringer | సుమారు నాలుగు దశాబ్దాల పాటు పాఠశాలలో బిల్ రింగర్ గా సేవలందించిన వ్యక్తికి విద్యార్థులు, టీచర్లు ఘన వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా పాఠశాల రోజులు గుర్తుకువచ్చాయని కామెంట్లు పెడుతున్నారు.
బిషప్ బెంగళూరులోని కాటన్స్ బాలికల పాఠశాలలో దాస్ అంకుల్ గతం 38 ఏళ్లుగా బెల్ రింగర్ గా సేవాలందిస్తున్నారు. తాజగా ఆయన చివరి రోజు విధులు నిర్వహించారు. పాఠశాల సమయం అయిపోగానే విద్యార్థులు, టీచర్లు, పాఠశాల సిబ్బంది బయటకు వచ్చారు. అనంతరం కౌంటింగ్ ప్రారంభించారు. దాస్ అంకుల్ తన గడియరాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యి కన్నీరు పెడుతూనే చివరి బెల్ మోగించారు. దింతో అక్కడున్న వారు చప్పట్లు, కేకలు పెడుతూ దాస్ అంకుల్ కు వీడ్కోలు పలికారు.








