BCCI Removes Rohit Sharma As ODI Captain | బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వన్డే ఫార్మాట్ లో కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మను తప్పించింది. ఆయన స్థానంలో శుభమన్ గిల్ కు పగ్గాలు అప్పజెప్పింది.
అక్టోబర్ 19 నుంచి టీం ఇండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఇందులో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ-20 మ్యాచులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఆస్ట్రేలియా టూర్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ స్థానంలో శుభమన్ గిల్ ను కెప్టెన్ గా ప్రకటించింది. అయితే జట్టులో సీనియర్ ప్లేయర్లు అయిన రోహిత్, విరాట్ కోహ్లీలకు స్థానం కల్పించింది.
ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ సమయంలో గిల్ ను బీసీసీఐ కెప్టెన్ గా నియమించిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో 2-2 తో ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ డ్రా గా ముగిసింది. తాజగా ఆయనకే వన్డే బాధ్యతలను అప్పగించడం ఆసక్తిగా మారింది. ఇకపోతే ఆస్ట్రేలియాతో టీ-20 సిరీస్ కు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు.









