Onteru Prathap Reddy About Kavitha Comments | మాజీ మంత్రి హరీశ్ రావుపై కవిత పలు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగానే బీఆరెస్ అధినేత కేసీఆర్ మరియు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఓడించేందుకు గతంలోనే హరీశ్ కుట్రలు చేశారని కవిత బాంబ్ పేల్చారు. గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడించేందుకు హరీశ్ కుట్ర పన్నారని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కేసీఆర్ పై పోటీ చేసిన ఒంటేరు ప్రతాపరెడ్డి కూడా బహిరంగంగానే చెప్పారని కవిత తెలిపారు.
ఈ ఆరోపణల నేపథ్యంలో ఒంటేరు ప్రతాపరెడ్డి స్పందించారు. ఆ రోజుల్లో రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి, వాస్తవాలు కాకపోయినా తాను హరీష్ రావు మీద విమర్శలు చేసినట్లు ఒంటేరు చెప్పారు. ఆ విమర్శలు అవాస్తవం.. తనది తప్పు అని ఆయన స్పష్టం చేశారు.
కొందరు ఉద్దేశ్యపూర్వకంగా గతంలో మాట్లాడిన వీడియోలను ఇప్పుడు వైరల్ చేస్తున్నారని అలాంటి వారిని చెప్పులతో సన్మానం చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో ఈ ఆరోపణలు చేసినట్లు ఒంటేరు ప్రతాపరెడ్డి వెల్లడించారు.









