Tuesday 22nd July 2025
12:07:03 PM
Home > తాజా > జానా రెడ్డితో సీఎం రేవంత్ భేటి.. కారణం ఏంటంటే!

జానా రెడ్డితో సీఎం రేవంత్ భేటి.. కారణం ఏంటంటే!

cm revanth meets jana reddy

CM Revanth Meets Jana Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, హోంశాఖ మాజీ మంత్రి జానారెడ్డి (Jana Reddy) నివాసానికి వెళ్లారు. ఆపరేషన్ కగార్ (Operation Kagar), శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు.

దేశంలో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఆపరేషన్ ను నిలిపివేసి, కాల్పుల విరమణ ఒప్పందం పాటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రయయత్నించాలని జస్టిస్ చంద్రకుమార్ (Justice Chandra Kumar) నేృత్వంలోని శాంతి చర్చల కమిటీ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ మావోయిస్టుల అంశాన్ని తాము సామాజిక కోణంలోనే చూస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో మాజీ హోం మంత్రి జానారెడ్డి సలహాలు తీసుకుంటామని కమిటీతో చెప్పారు. అందులో భాగంగా సోమవారం ఉదయమే జానారెడ్డి నివాసానికి వెళ్లి ఆపరేషన్ కగారు  పై ఎలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై చర్చించినట్లు సమాచారం.

You may also like
‘మొబైల్ వలస సహాయ కేంద్రం’
ఢిల్లీలో చంద్రబాబు-రేవంత్ భేటీ
‘కల్తీ కల్లు ఘటన..రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలి’
‘నారా లోకేశ్-మాధవ్ భేటీ..తెలంగాణ అస్థిత్వంపై దాడి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions