CONGRESS LEADER MURDER IN AP | ఆంధ్రప్రదేశ్ ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణ దారుణ హత్యకు గురయ్యారు. గుంతకల్లు రైల్వే వంతెన వద్ద దుండగులు తొలుత లారీ తో ఢీ కొట్టి వేటకొడవళ్ళతో నరికి చంపారు.
ఈ ఘటనలో ఆయన కుమారుడు వినోద్ కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే హత్య చేసింది ఎవరు, కారణం ఏంటో తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు.
చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య తనను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందన్నారు. లారితో ఢీ కొట్టి,వేట కొడవళ్ళతో నరికి చంపడం అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం అవుతుందని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసు శాఖ అత్యున్నత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని తెలిపారు. లక్ష్మీ నారాయణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.









