Thursday 12th December 2024
12:07:03 PM
Home > తాజా > వివాహ బంధంలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్..#fortheloveofnyke

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్..#fortheloveofnyke

Keerthy Suresh Marries Antony In Goa | తన నటనతో తెలుగు ప్రేక్షకులకు అత్యంత దగ్గరైన నటి కీర్తి సురేష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

కీర్తి సురేష్ ( Keerthy Suresh ) మరియు అంథోనీ ( Antony ) 15 ఏళ్ల నుండి స్నేహితులు. వీరి స్నేహం అనంతరం ప్రేమగా మారింది. ఈ క్రమంలో 15 ఏళ్ల తమ స్నేహ బంధం ఇక జీవితాంతం కొనసాగనున్నట్లు కీర్తి సురేష్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.

అంథోనీ నటి కీర్తి సురేష్ మెడలో మూడు ముళ్ళు వేశారు. గోవాలోని ఓ ప్రైవేట్ రిసార్ట్ లో వీరి పెళ్లి వేడుకగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమక్షంలో ఈ జంట ఒకట్టయ్యింది.

పెళ్లికి సంబంధించిన ఫోటోలను కీర్తి సురేష్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. #fortheloveofnyke అనే హాష్ట్యాగ్ ( Hashtag ) ను కీర్తి సురేష్ ఫోటోలకు జత చేశారు.

ప్రస్తుతం కీర్తి సురేష్ పెళ్ళి ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో నూతన జంటకు సినీ ప్రముఖులు మరియు అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు.

You may also like
అతుల్ సుభాష్ ఆత్మహత్య..#Mentoo ట్రెండింగ్
రోడ్ యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి..అంగీకరించిన నితిన్ గడ్కరీ
‘తెలంగాణ సంస్కృతిపై దాడి జరుగుతోంది’
జమిలి ఎన్నికలకు ముందడుగు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions